పగడ్బందీగా పోడు భూముల సర్వే
– ఇబ్బందులు ఉంటే తెలపండి
– సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్
అశ్వరావుపేట అక్టోబర్ 13( జనం సాక్షి ) ఏజెన్సీలో గిరిజనుల పోడు భూములను పకడ్బందీగా సర్వే జరిపి వ్యవసాయం చేసుకునే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అశ్వరావుపేట మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్ అన్నారు. పోడు భూముల సర్వే జరుగుతున్న ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇబ్బందులు ఉంటే తెలపాలని, పోటు భూములు ఉన్న ప్రతి ఒక్కరూ సర్వే చేపించుకోవాలని తెలిపారు. ఎ టువంటి ఇబ్బందులు కలిగినట్లయితే తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ సి కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ యువజన కమిటీ సభ్యులు నారం నరసింహారావు, పుట్టి శ్రీను దుర్గారావు వెంకటేష్ సోమరాజు ఈశ్వర్ చందారావు ప్రభుదాస్ మల్లేష్ నారం రాముడు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.