పగిలిన మంజీరా పైప్‌లైన్.. వృథాగా పోతున్న నీరు
మెదక్, జిల్లాలోని ఆర్‌సీపురం వద్ద ముంబై రహదారిపై మంజీరా వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది. రహదారి మొత్తం జలమయమైంది. గంట నుంచి నీళ్లు వృథాగా పోతున్నా మరమ్మతులకు ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలుమార్లు పైప్‌లైన్ పగిలినా సిబ్బంది అప్పటికప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. నగరానికి తాగునీరు అందించే పైప్‌లైన్‌పై నిర్లక్ష్యం వీడి మరోమారు పైపులైన్లు పగలకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.