*పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం
చందాపూర్ లో మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ*
తొగుట.జనంసాక్షి, నవంబర్.19, శనివారం- పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు..తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ బొడ్డు నర్సింలు ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కి నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువొచ్చి, నిధులు మంజూరు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు.. గ్రామాల్లో నర్సరీలు, పార్కులు, వైకుంఠదామాలు, డంపింగ్ షేడ్ లు, ఇంటింటి చెత్త సేకరణకు ట్రాక్టర్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..సింధు నాగరికత సమయంలోనే మరుగుదొడ్లు వాడిన చరిత్ర మనకుందన్నారు..గ్రామ గ్రామాన మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగిందని, అయితే వాటిని 100 శాతం వినియోగించుకోవలన్నారు..బహిరంగ మల విసర్జన మూలంగా పరిసరాలు కలుషితమవుతున్నాయని, అతిసార, కలరా లాంటి వ్యాధుల దోహదానికి కారణమవుతుందన్నారు.. సర్పంచ్ బొడ్డు నర్సింలు మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.. మరుగుదొడ్లు ఉండటం గొప్ప విషయం కాదు..వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు..సీఎం కేసీఆర్ గారి సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.కార్యక్రమంలో కార్యదర్శి మహేశ్వరి, అంగన్వాడీ టీచర్ జ్యోతి, సీఏ స్వర్ణలత , ఎఫ్ఏ కవిత, ఉపాధ్యాయులు అరుణశ్రీ, గంగ, యువజన నాయకులు నరేందర్, ఆంజనేయులు, శ్రీకాంత్, విజయకాంత్, పవన్, నవీన్, బాలు, మల్లికార్జున, ఇంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు..