*పచ్చిరొట్ట పంట పై భాస్వరం ఎరువుల ప్రభావం రైతులకు అవగాహన సదస్సు*
పెబ్బేరు జూన్ 22 ( జనంసాక్షి ):
పెబ్బేరు మండలం రామాపురం
గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతు సోదరులకు పచ్చిరొట్ట పంటలపై భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేల చాలావరకు భూసారం తగ్గి మరియు సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉందని అని ప్రతి రైతు తన పొలంలో జీలుగ వేసుకోవాలని అట్టి వాటిని పూత దశలో దున్నడం వల్ల నేల కు కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా నేల యొక్క చౌడు గుణాలు కూడా తగ్గిస్తుంది. మరియు భాస్వారపు జీవన ఎరువుల గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. నేలలో లభ్యంకాని భాస్వరపు రూపాన్ని కరిగించి ఉపయోగపడే రీతిలో మార్చడానికి కొన్ని సూక్ష్మజీవులు ధోహ పడతాయి. వీటినే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు అంటారు. ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడినప్పుడు భూమిలో నిరుపయోగంగా ఉన్న భాస్వరం లభ్యమౌతుంది. కాబట్టి పైపాటుగా డి.ఎ.పి గాని భాస్వరం కలిగిన కాంప్లెక్స్ లను గాని తగించవచు.అని రైతుల కు తెలియజేయడం జరిగింది.
ప్రతి రైతు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ వారు కోరడమైనది. కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారి అంజనేయులు, వట్టిపల్లి కృష్ణారెడ్డి, కారెడ్డి శేఖర్ రెడ్డి, జంగాల తిరుపతయ్య, జక్కుల కాశన్న, గొల్లరాముడు, మొగిలన్న, జనిగ కొండన్న, ఆడెం బుచ్చమ్మ గ్రామ రైతులు పాల్గొన్నారు.