*పచ్చ జెండాను చూస్తే టిఆర్ఎస్ ఉలుకెందుకు*: టీ. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్

రాష్ట్ర రామన్ గౌడ్ అన్నారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కుట్రల బాబు  మల్లొస్తున్నాడంటూ నమస్తే తెలంగాణలో టిఆర్ఎస్ సోషల్ మీడియాలో   విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండించారు. మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాలుగా ఆగుపడగానే అంత ఉలిక్కిపాటు ఎందుకని తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ జాగీరా అని ప్రశ్నించారు. తెలంగాణ నడిబొడ్డున ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్  లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని కొత్తగా తెలంగాణలో కుట్ర చేయటానికి రాబోతున్నది అనడం విడ్డూరంగా ఉందన్నారు .తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే తెలంగాణలో పటేల్, పట్వారి వ్యవస్థ రద్దు చేసి మండలిక వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దే అన్నారు. బీసీలకు, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామి కల్పించి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలంగాణలో బిజెపిని అడ్డం  పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తుందని  అనడం అర్థరహితం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 సంవత్సరాలు అధికారంలో 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడమే కాక తెలంగాణ ఏర్పాటు తర్వాత 15 స్థానాల్లో ఎమ్మెల్యే  ఒక ఎంపీ స్థానంలో గెలిచి విషయం టిఆర్ఎస్ పార్టీ మర్చిపోయిందన్నారు. 2018 లో కూడా రెండు స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందామని పేర్కొన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని కుట్రలో భాగంగా గెలిచిన సభ్యులందరినీ కొనుగోలు చేసి పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన విషయం పేద ప్రజల వర్గాలలో రగులుతుందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ లో బిఆర్ఎస్  సభ ఏలా పెడతారని ప్రశ్నించారు .రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు  ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప నేడు కొత్తగా ఏమి చేశారని ప్రశ్నించారు .హైటెక్ సిటి. సైబరాబాద్ సిటీ నిర్మించి తెలంగాణ లో సంపదను సృష్టించిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరు అన్నారు .తెలంగాణలో సభ్యత్వ నమోదు సంస్థ గత నిర్మాణం చేసుకుంటూ రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తట్టుకోలేక టిఆర్ఎస్ పార్టీ మళ్లీ విషం చిమ్మడానికి తన పత్రికను సోషల్ మీడియాను వాడుకుంటుందని ఆరోపించారు ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదని రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓటమి అంచులో ఉన్న టిఆర్ఎస్ చంద్రబాబునాయుడు పై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో  లేరని చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారని చేసిన అభివృద్ధిని చెప్పుకోలే నీ దౌర్భాగ్యమైన స్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించారు.