పటన్ చెరువులో గ్యాస్ లీక్..
మెదక్ : జిల్లా పటాన్‌చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రభాకర్‌రెడ్డి, రుక్మిణి అనే దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని.. మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలైన ప్రభాకర్‌రెడ్డి దంపతులను ఆస్పత్రికి తరలించారు.