పటాన్‌చెరులో ఇద్దరు మంత్రుల పర్యటన
మెదక్ : జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పర్యటించారు. వీరితోపాటు పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా అభివృద్ధి పనులకు వారు శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో ఆయా పనులను చేపడుతున్నా… అర్ధం పర్ధం లేని ఆరోపణలు, విమర్శలతో ప్రతిపక్షాలు ప్రజల్లో చులకనై పోతున్నాయన్నారు.