పటేల్‌ సుధాకర్‌రెడ్డికి ఘననివాళి

 

 

మల్దకల్‌.జ‌నంసాక్షి

మావోయిస్టు అగ్రనాయకుడు,దివంగత పటేల్‌ సుదాకర్‌ రెడ్డి 9వ వర్దంతి సందర్బంగా ఆయన స్వగ్రామమైన కుర్తిరావులచెరువులో గురువారం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు స్మారక స్థాపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పటేల్‌ సోదరులు పటేల్‌ శ్రీనివాసరెడ్డి, పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, పటేల్‌ జనార్ధన్‌రెడ్డితో పాటు పటేల్‌ సుదాకర్‌ కుమారుడు హాజరై తాడిత,పీడిత ప్రజలకు పటేల్‌ చేసిన సేవలను కోనియాడారు. ఉద్యమంలో ఉండి తెలంగాణకోసం, పేదప్రజలకోసం పోరాటం చేశాడని వారు ప్రశంశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రేలారే ప్రసాద్‌ ,రాహూల్‌ పటేల్‌ పై పాటపాడి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతు వచ్చే జయంతినాటికి వాటర్‌ ప్లాంట్‌, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్‌ మహబూబ్‌అలీ ,చంశ్రేఖర్‌రెడ్డి, నరేందర్‌, రమేశ్‌రెడ్డి తదితరులు విప్లవాభివందనాలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.