పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తాం; మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ
కోదాడ టౌన్ అక్టోబర్ 15 ( జనంసాక్షి )
కోదాడ పట్టణంలోని 18 వ వార్డ్ పరిధిలోని తులసి టౌన్ షిప్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మురుగు నీరు పొంగి రోడ్ పైకి రావటంతో, ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగిన విషయాన్ని తెలుసుకొని, స్థానిక కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు తో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కాలనీల అభివృద్ధి వలన నూతన గృహ నిర్మాణాలు పెరగడంతో రోడ్స్ మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరచాల్సిన అవసరం పెరుగుతుందని, దీని కోసం రాబోయే 20 సంవత్సరాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని, త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.తులసి టౌన్ షిప్ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా త్వరలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు తో పాటు స్థానికులు లక్ష్మీ, సుధాకర్,ఫయాజ్ పాల్గొన్నారు.