పట్టణ ప్రగతితో పట్టణాల అభివృద్ధి* *పట్టణ ప్రగతిలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్,  శ్రీనగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు.
కాలినడకన వార్డ్ అంతటా తిరిగి జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.
మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ…
పట్టణాలు ప్రగతి బాటలో ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం , సీఎం కేసీఆర్  కృషి చేస్తున్నారన్నారు.
పట్టణాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్  పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.
మంత్రి వర్యులుఎప్పటికప్పుడు
నిర్మల్ పట్టణంలో పట్టణ ప్రగతి పై సూచనలు సలహాలు అందచేస్తున్నారన్నారు.
రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వరదనీరు మురికి నీటి కాలువల్లో ఆగిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు.
మురికి నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్త-చెదారం ,ప్లాస్టిక్ వ్యర్థలను తొలగింపచేయు ప్రకీయ,మురికి నీటి కాలువల వెంబడి ఆస్థ వ్యస్థంగా పెరిగినటువంటి పిచ్చి మొక్కలు వంటివి తొలగింపచేయు ప్రకీయ, ఖాళీ స్థలాల్లో ఏర్పడిన మురికి నీటి కుంటలు ,వంటివి శుభ్రం చేయి ప్రకీయ పనులను దగ్గరుండి  చేయిస్తున్నామని అన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు రాష్ట్ర మంత్రి వర్యులు  ఇంద్రకరణ్ రెడ్డి   సహకారంతో నిర్మల్ పట్టణంలో
 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా 42 వార్డుల్లో దశలవారీగా  ప్రతీ రోజు పర్యటిస్తూ , జరుగుతున్న పారిశుద్ధ్య పనులను,అభివృద్ధి
పనులను పరిశీలిస్తున్నామని అన్నారు
నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను ఆడిగితెలుసుకొని తక్షణమే సమస్యలు పరిష్కరించేలా ప్రకీయ చేపడుతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో.స్థానిక కౌన్సిలర్-రామగోని తులసి-నర్సాగౌడ్,సానిటరీ యస్.ఐ-దేవిదాస్,
నువ్వుల రాజు,జి.గంగాధర్,
నారాయణ గౌడ్, జి.సుదర్శన్,
ఉమాపతి గౌడ్,రాజు,సాయి ప్రసాద్,రాకేష్ సింగ్,విరాట్,
కాలనీవాసులు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.