పట్టాలకెక్కిన యాద్రాద్రి ప్రాజెక్టు పనులు

యాద్రాద్రి,నవంబర్‌7(జ‌నంసాక్షి): యాదాద్రి అల్టా మెగా విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సిఎం కెసిఆర్‌ సమక్షంలో నిర్మాణ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు చెక్‌ అందచేయడంతో నిర్దేశించిన మేరకుపనులకు రంగంఓలకి దిగింది. నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. కీలకమైన టర్బైన్‌ బాధ్యతల్ని బీహెచ్‌ఈఎల్‌కు అప్పగిస్తూ తొలివిడత నిధుల్ని అందజేసింది. ముఖ్యమంత్రి చేతుల విూదుగా చెక్‌ అందుకున్న బీహెచ్‌ఈఎల్‌ క్షేత్రస్థాయిలో పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రం పనులకు ముందడుగు పడింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద విద్యుత్తు కేంద్రం నిర్మాణ కాబోతుంది. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఈ మేరకు ప్రత్యేక వ్రద్ద తీసుకుని పనునలు పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తయితే తప్ప విద్యుత్‌ ఉత్పత్తి జరిగి మిషన్‌ భగీరథ తదితర పనులకు విద్యుత్‌ సరఫరా చేయలేమని సిఎం ఇప్పటికే తెలిపారు.