*పట్టా భూముల సమస్యలను త్వరగా పరిష్కరించండి*

తహసిల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);
   జిల్లాలో పట్టా భూములు  సమస్యలు ఎక్కువ ఉన్న సందర్బాలలో తహసిల్దార్లు చొరవ తీసుకొని  దానికి గల కారణాలను పరిశిలించి  సమస్య ను పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసిల్దార్లను   ఆదేశించారు.
బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అన్ని మండలాల తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన ససమావేశంలో కలెక్టర్  మాట్లాడుతూ ధరణి  టి ఎం 33 లో పరిష్కరించాల్సిన  సమస్యను పేర్లు, విస్తీర్ణం , మిస్సింగ్ సర్వే నెంబర్లు  ఇతరములు అన్నింటికీ సంబంధించి   పెండింగ్ లో ఉన్నవని, మండలం వారిగా వాటిని క్లియర్ చేయాలనీ తహసిల్దార్లకు ఆదేశించారు.  జి ఎల్ ఏమ్స్,సక్సేషన్స్  మ్యుటివే షన్స్ , పి ఓ బి పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయాల్లన్నారు.  తహసిల్దార్లు ప్లాన్  ప్రాకారం ప్రతి రోజు టార్గెట్ పెట్టుకొని  పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయాలన్నారు. మండలాల వారిగా  ఏ మండలం లో ఎన్ని పెండింగ్ ఉన్నవని అడిగి తెలుసుకున్నారు. మండలాలలో  పేర్లు మిస్సింగ్ సర్వే నెంబర్లు  ఐడెంటిఫై చేయాలని, ఎచ్ ఆర్ సి  రిపోర్ట్స్ , కోర్ట్ కేసులు ,లోక యుక్త త్వరగా పూర్తి చేసి పంపించాలని తహసిల్దార్లకు ఆదేశించారు.
సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీహర్ష ,రెవెన్యూ డివిజనల్ అధికారి రాములు,  సి సెక్షన్ సూపరిండెంట్  రాజు, అన్ని మండలాల  తహసిల్దార్లు పాల్గొన్నారు.