పట్టుదలతో కష్టపడి చదివి ప్రిలిమ్స్ లో సత్తా చాటాలి
* వచ్చేనెల 7న ఎస్సై, 21న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలు
* ఎన్బీఆర్ ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయం
* మనో ధైర్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి : మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు
మిర్యాలగూడ. జనం సాక్షి
వచ్చేనెల 7న ఎస్సై, 21న నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కు హాజరయ్యే ఔత్సాహిక అభ్యర్థులంతా పట్టుదలతో కష్టపడి చదివి సత్తా చాటాలని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు కోరారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్బీఆర్ ఫౌండేషన్,మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలీస్ వారు సంయుక్తంగా గ్రూప్ 2,3,4, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత మోడల్ పరీక్ష-2 నిర్వహించారు. పరీక్షకు మొత్తం 520 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ శాఖలో కొలువు సాధించాలంటే రాత పరీక్షలో అర్హత సాధించాలని అన్నారు. అదేవిధంగా, ఫిజికల్ ఫిట్నెస్ కోసం అధిక సమయం కేటాయించాలని అభ్యుర్ధులకు సూచించారు. అనంతరం పలువురు అభ్యర్థులను వేదికపైకి పిలిచి ఫిజికల్ ఫిట్‌నెస్ లో కొన్ని మెళుకువలను నేర్పించారు. అనంతరం పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది అభ్యర్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుద్దుల సైదులు, శిరసన గండ్ల శ్రీకాంత్ చారి, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, సాధినేని శ్రీనివాస్, ఆయిల్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.