పత్తిపంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి జావిద్

జనంసాక్షి/
మండలంలో రైతులు వానాకాలంలో వేసినటువంటి పంటలను గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి జావీద్ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పత్తి పంటలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి జావిద్ మాట్లాడుతూ వారంరోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలో నీరు నిల్వగా ఉంటే అ నీరుని బయటికి తీసివేయాలని తెలిపారు.పంట వడలి పోతే లీటర్ నీటికి 3 గ్రా చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క అడుగు భాగం తడిసే విదంగా 5-7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.పంట త్వరగా కోలుకోవడానికి  లీటర్ నీటికి 10 గ్రా ల మల్టి కె లేదా 19:19:19 ల వంటి పోషకాలను  పిచికారీ చేసుకోవాలని అన్నారు.