పత్తిరైతులకు దక్కని ఆదరువు :గండ్ర

వరంగల్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్‌ నేత కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. గతేడాది పత్తికి డిమాండ్‌ లేదని చెప్పడంతో సోయా వేశారని, ఈ యేడు పత్తివవేసినా రైతులకు ఊరట దక్కలేదన్నారు. పత్తివేయకుండా.. సోయా పంట వేయాలని ప్రభుత్వం ఆనాడు చెప్పిందని.. కానీ ఈ ఏడాది పత్తికి మాత్రం అధికంగా ధర ఉంటుదనుకున్నా లాభం లేకుండా పోయిందన్నారు. అలాగే . సోయాకు కూడా గిట్టుబాటు ధర లేదని వివరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకు పోయిందని గండ్ర విమర్శించారు. పత్తి సాగులో దక్షిణాదిలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉండేదని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతులకు గిట్టుబాటు ధర అందక పత్తి స్థానం దిగజారిపోయిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లోనూ రాష్ట్రం దిగజారిందన్నారు. మూడున్నరేళ్లుగా రైతుల ఆదాయం సగానికి పడిపోయిందన్నారు. అనేక కార్యక్రమాలకు దుబారా చేస్తున్న ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఉండవా అని ప్రశ్నించారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అలాగే మైనార్టీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామిని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.