పత్తిలో బొట్టుపెట్టు పద్దతిపై అవగాహన
బిజినేపల్లి, జనం సాక్షి. ఆగస్టు 23 : పత్తి పంటను అమితంగా నష్టపర్చే గులాబీరంగు పురుగు నివారణకు బొట్టుపెట్టు పద్దతిపై మంగళవారం రైత లకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ఖానాపూర్లో కేవీకే కీటక శాస్త్రవేత్త ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ పీబీడబ్ల్యూ జెల్తో గులాబీ రంగు పురుగు పునరుత్పత్తిని తగ్గించుకొని నివారణ చేసుకోవాలని సూచించారు. పీబీడబ్ల్యూ ||జెల్ను ఎకరాకు 400 చోట్ల లేత ఆకుల ఈనెల మధ్యలో ఒక చిన్న బొట్టులాగా పెట్టుకోవడం వల్ల ఒక రకమైన రసాయనాన్ని విడ మదల చేయడం ద్వారా మగ రెక్కల పురుగులు ఆకర్షించి అగిపోవడం వల్ల ఆడ రెక్కల పురుగులతో సంపర్కం జరగకపోవడంతో పునర్పుత్తత్తి ఆగిపోతుందని వివరించారు. క్షేత్ర ప్రదర్శనలో 25 మంది రైతులకు పీబీడబ్ల్యూ జెల్ను అందజేశారు. కార్యక్రమం ||ఏఈఓలు శారద, గౌతమి తదితరులు పాల్గొన్నారు.