పదవులు కాపాడుకోవడమే వీరీ పరమార్దం
విజయవాడ: రాష్ట్రంలో 3300 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం జెన్‌కో ఆరేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంటే కేటాయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఎంపీలు దద్దమ్మల్లా చూస్తున్నారు తప్ప గ్యాస్ మళ్లించొద్దని అడిగే దమ్ము, ధైర్యం వారికి లేవన్నారు. కేంద్రంలో పెట్రోలియం మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి అడ్డుకున్నా, ఇక్కడి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గట్టిగా ప్రతిఘటించినా గ్యాస్ మళ్లించేవారు కాదని నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం శ్మశానంగా మారుతున్నా కేంద్ర మంత్రి పదవి కోసం జైపాల్‌రెడ్డి, సీఎం పీఠం కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి నోరెత్తడం లేదని ఆరోపించారు. మీకు అడగడం చేతకాకపోతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరినీ ఢిల్లీకి తీసుకేళ్లండి. మేం అడుగుతాం అని చెప్పాం. అది కూడా సీఎం చేయట్లేదు. ఏదైనా అంటే నేను లేఖ రాశానంటున్నారు. ఈయన రాసే ప్రేమలేఖలను కేంద్రంలో పట్టించుకునే వారెవరూ లేరు. సోమవారం మేమే హైదరాబాద్‌లో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. అందరినీ సీఎం ఢిల్లీకి తీసుకెళ్లకపోతే సీఎం లేకుండ మేమే ఢిల్లీ కూడా వెళ్తాం లని స్పష్టం చేశారు.