పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

చింతలపాలెం  జనంసాక్షి

 సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక 1981-82 పదవ తరగతి బ్యాచ్ జిల్లా పరిషత్ హై స్కూల్ దొండపాడు విద్యార్దులు,40 సంవత్సరాల తర్వాత వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక్కటై 10/7/22 ఆదివారం తొలి ఏకాదశి నాడు తాము చదువుకున్న పాఠశాల ఆవరణలో బ్యాక్ టు స్కూల్ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పదవ తరగతి వరకూ కలసి చదువుకొని తర్వాత పై చదువుల కోసం,వివిధ వృత్తులులో స్థిరపడి,ఉద్యోగాలు,విదేశాలలో ఉన్న వారంతా కలిసి సంతోషాన్ని చిన్ననాటి తీపి గుర్తులనుపంచుకున్నారు.ఆస్తులు,బంధువులు కంటే స్నేహం గొప్పదని వాస్తవాన్ని గుర్తించారు.పాటలు,ఆటలు,డాన్సులు, జోక్స్,తదితర వినోద కార్యక్రమాలు తో పాటుగా,ఆషాఢమాసం తొలి ఏకాదశి నాడు అందరుకలిసి విందు భోజనం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మధిర వెంకటరెడ్డిి,కొండ మన్మధరెడ్డి,బడుగుల సైదులు,పరిమి వేణుగోపాల్,నాగేశ్వరరావు, కిషోర్,శ్రీను,పాలేటి నాగేశ్వరరావు, మహాలక్ష్మి,విజయారెడ్డి,గురుకుమరి, అక్కమ్మ,సీతారామ,విజయ కుమారి, నారాయణమ్మ,కొట్టే రవిందేర్,హుస్సేన్,తోట శ్రీను,రాపోలు వెంకటేశ్వర్లు,వెంకటేశ్వర్లు, వెంకటరమణ,పుల్లారెడ్డి,అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.