పదవ తరగతి  2001 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

వీణవంక, ఆగస్టు 27: (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పదవ తరగతి 2001-2002 బ్యాచ్ కు చెందిన  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ…విద్యార్థులకు మేము చెప్పిన చదువులు ఇంతమంది ప్రయోజకులు అయినారు అంటే మాకు చెప్పుకోవడానికి కూడా గర్వంగానే ఉంటుందని మేము చెప్పిన చదువును విద్యార్థులు శ్రద్ధగా విని చదివి ఇంత మంచి ప్రయోజకులు తో పాటు మంచి మంచి స్థాయిలో ఉంటే ఉపాధ్యాయులకు ఆనందంగా ఉంటుందని వారన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ.. అప్పటి నాణ్యమైన చదువులు అప్పటి గురువులు చెప్పిన బోధన వల్లే మేము ఈ స్థాయికి రావడం జరిగింది అన్నారు చదువుకునే రోజులలో పాఠశాలల్లో చేసిన చిలిపి పనులను అప్పటి పాఠశాలలను గుర్తు చేసుకుంటూ అన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని మళ్లీ ఇటువంటి జ్ఞాపకాలు చిరస్థాయి నిల్చుకోవాలని మనం ఎక్కడ ఉన్న ఇటువంటి ఆత్మీయత చూపించుకోవాలని ఉన్నారు. పూర్వ విద్యార్థిని విద్యార్థులు
సుమారు 21 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరు పదవ తరగతి చదువుకున్న పాఠశాలలో  ఒకే చోట అందరూ కలుసుకొని ఆలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై కష్టసుఖాలను సభాముకంగా పంచుకొని ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు పూల మాళలువేసి, శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థులు. ఎనగంటి నరేష్. ఆదిరెడ్డి. గడ్డం కుమారస్వామి. కర్రె నాని. శ్రీనివాస్. నగేష్. రాజ్ కుమార్. రవి. సంపత్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.