పది జిల్లాల్లో కొనసాగుతున్న ‘ తెలంగాణ దీక్షాదివస్‌ ‘

హైదరాబాద్‌: తెలంగాణలోని పది జిల్లాలు ‘ తెలంగాణ దీక్షా దివన్‌ ‘ సందరర్భంగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణ అంతటా పలు ప్టణాలు, గ్రామాలు దీక్షా శిబిరాలతో కిక్కిరిసి పోయాయి. కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షచేసి కేంద్రప్రభుత్వం నుంచి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేపింది. మూడేళ్లు పూర్తన సందర్భంగా ఈ దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఇల్లందు, కొత్తగూడెంచ పాల్వంచ, అశ్వారావుపేట, ముదిగొండలలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ కొనసాగుతుంది.

మెదక్‌ జిల్లాల పటాన్‌చెరు, నారాయణ్‌ఖేడ్‌, దుబ్బాకలలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ జరుగుతుంది. మెదక్‌ జిల్లా లోని పలు ప్రాంతాల్లో దీక్ష కొనసాగుతుంది. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దీక్ష కోనసాగిస్తున్నారు.

కరీంనగర్‌లో సిరిసిల్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు దీక్షా దివస్‌ సందర్భంగా నిరసన కోనసాగిస్తున్నారు. ఇంకా జిల్లాలోని గోదావరిఖని. వేములవాడ, చొప్పదండిలలో కూడా దివాస్‌దీక్షకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరైనారు. జిల్లాలోని హుజురాబాద్‌లో అంబేద్కర్‌ చౌరస్తాలో తెలంగాణవాదుల ఆధ్వర్యంలో దీక్షాదివస్‌ కొససాగుతుంది.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, వెల్పూరులలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు దివస్‌ దీక్షా దివస్‌ శిబిరాలలో జైతెలంగాణ నినాదాలతో మార్మోగిస్తున్నారు. నిజామాబాద్‌ పట్టణంలోని ధర్నా చౌక్‌లో దీక్షా దివస్‌ను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ దీక్షకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

నల్గొండ జిల్లాలలో మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, నకిరేకల్‌, కోదాడ, దేవరకొండ, భువనగిరి మునుగొండలలో దీక్షాదివస్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు తరలివచ్చారు.

వరంగల్‌, హన్మకొండ, నర్సంపేట, మహబూబాబాద్‌లలో పెద్ద ఎత్తున తెలంగాణ దీక్షాదివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున తెలంగాణ వాదులు పాల్గొన్న ఈ కార్యక్రమం జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతుంది.