పది లో మెరుగైన ఫలితాలు.

అభినందనలు తెలిపిన డిఈఓ గోవిందరాజులు.
రాష్ట్రస్థాయిలో 16వ స్థానం,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి స్థానం. సాధించిన నాగర్ కర్నూల్ జిల్లా.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్30(జనంసాక్షి):
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన మొత్తం 61 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు వివిధ యాజ మాన్యాలకు చెందిన 238 పాఠశాలల నుంచి 10937 మంది విద్యార్థులు హాజరయ్యారు.వీరిలో బాలురు 5511  మంది, బాలికలు 5426 మంది ఉన్నారు.
అమ్మాయిలే మెరుగైన ఫలితాలు సాధించారని డిఈఓ గోవిందరాజులు పేర్కొన్నారు.టెన్త్ ఫలితాల్లో అబ్బాయిలు 90.55 శాతం, అమ్మాయిలు 95.48 శాతం పాస్ అయినట్లు ఆయన తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా నుండి మొత్తం 10937 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10171 మంది విద్యార్థినీ విద్యార్థులు పాస్ అయినట్లు స్పష్టం చేశారు.ఈ ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా ప్రార్థిస్థాయిలో 16వ స్థానంలో ఉండగా,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల వారిగా ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని  అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 766 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారి కోసం ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు.
విద్యార్థులు వారి యొక్క మార్కుల రీకౌంటింగ్ కొరకు ప్రతి సబ్జెక్టుకు 500,  రూపాయలతో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ గారి పంపి చూసుకోవాలని,
అదేవిధంగా రీ వెరిఫికేషన్ కొరకు సంబంధిత నమూనా కాపీయందు ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయల చొప్పున చలాన్ చెల్లించి సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని జూలై 15లోగా సమర్పించాల్సి ఉంటుందని డిఇఓ తెలిపారు. పదో తరగతిలో నాగర్ కర్నూల్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టుల ఉపాధ్యాయులకు, పాసైన విద్యార్థులకు, కార్యాలయ సిబ్బంది, అధికారులకు డిఈవో గోవిందరాజులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.