పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్ 5జనంసాక్షి:
 పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
 శనివారం కలెక్టర్ కార్యాలయ తన ఛాంబర్ లో ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు ప్రజల అవగాహన ప్రచారానికై రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆవిష్కరించారు.
 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….
 బ్యాంకు ఖాతా, సిమ్కార్డు, వివిధ ఉపకార వేతనాలు, ఆదాయపు పన్ను, బ్యాంకు రుణాలు, ఒక దేశం – ఒక రేషన్ కార్డు కింద దేశంలో ఎక్కడైనా సరుకులు పొందేందుకు అవకాశం ఉందన్నారు.
ఇలా వెయ్యి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నవీకరించిన ఆధార్ తో పొందవచ్చని చెప్పారు.
 జిల్లా ప్రజలు తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆన్లైన్లో ఆధార్ నవీకరణకు myaadhar.uidai.gov.in వెబ్సైట్లో లాగిన అయి గుర్తింపు చిరునామా, పేరు, పుట్టిన తేదీ, లింగం తదితరాలకు సంబంధించి పత్రాలను పొందుపరచాలన్నారు. ఆధార్ కేంద్రంలోనూ ధ్రువపత్రాలను పొందుపరిచేందుకు అవకాశం ఉందని సూచించారు. వివరాలకు
1947 కాల్ చేసి సాయం తీసుకోవచ్చని లేదా [email protected]@uidai.net.in కు మెయిల్ చేయవచ్చని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 26 శాశ్వత ఆధార్ కేంద్రాలు, 8 ఆధార్ సాధారణ కేంద్రాలు, జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో కూడా ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు ఎక్కడైనా సంప్రదించి ఆధార్ను అప్డేషన్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, సెక్షన్ సూపరింటెండెంట్ బాలరాజ్, జిల్లా ఇ డిస్టిక్ మేనేజరు నరేష్, కలెక్టర్ పి ఎస్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.