పదేళ్ల తెలంగాణ పాలనలో అభివృద్ధి శూన్యం

` దొరల సర్కారుకు, ప్రజల సర్కారుకు మధ్య పోటీ
` అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోని కేంద్రం
` కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్న విషయం మారిచారా
` కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి
` అధికారంలోకి రాగేనే కెసిఆర్‌ అవినీతిని సొమ్మును కక్కిస్తాం
` ధరణిని అడ్డుపెట్టుకొని పేదల భూములను లాక్కుంటున్నారు
` సీఎం దోచుకున్న సొమ్మును వసూలు చేసి.. పేదలకు పంచుతాం
` పదేళ్ల పాలనలో నువ్వు ఏం చేశావో చెప్పగలవా కెసిఆర్‌..
` సంగారెడ్డి, ఆందోల్‌, కామారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌
సంగారెడ్డి బ్యూరో/కామారెడ్డి/ఆందోల్‌్‌(జనంసాక్షి): తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి వూన్యమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కెసిఆర్‌ తెలంగాణను దోచుకోవడంలోనే ముందున్నారని మండిపడ్డారు. ఆదివారం రాహుల్‌ కామారెడ్డి, ఆందోల్లో పర్యటించి ప్రచారం నిర్వహిం చారు. తెలంగాణలో ఏం అభివృద్ది జరిగిందో చెప్పాలని, అలాగే అవినీతిపై సమాధానం ఇవ్వాలని  ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా  అందోల్‌ లో నిర్వహించిన సభలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూలో ఎదురు చూస్తున్నారని, పేపర్ల లీక్‌తో వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కలిసి ప్రజల డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని, ఒకిరిక ఒకరు సహకరించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతు న్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలోనే 6 గ్యారెంటీలపై సంతకం పెట్టి అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. అలాగే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 వేస్తాం. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం.’ అని రాహుల్‌ వివరించారు.  హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ లోని నిరుద్యోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని, రాష్ట్రంలో పేపర్‌ లీకేజీ వల్ల వారు ఎంతో నష్టపోయారని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే, అవి రద్దవడంతో వారి బాధలు వర్ణనాతీతమని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హావిూ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని బీఆర్‌ఎస్‌ అంటోందని, ’కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. విూరు ఏ స్కూల్‌ చదివారో ఆ స్కూల్‌ కట్టించింది కాంగ్రెస్‌ పార్టీ.’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ దోచుకున్న సొమ్మును రికవరీ చేసి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రితో ఆ నగదును పేదల అకౌంట్‌ లో వేస్తామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ ఒక్కటయ్యాయని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ’ల్యాండ్స్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రధాని మోదీ నాపై 24 కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్‌ నుంచి నన్ను పంపించేశారు. అవినీతిపరుడైన కేసీఆర్‌ పై మాత్రం ఒక్క కేసు కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రజలు ఆలోచించి హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌  మెక్కేసిన నిధులను కక్కిస్తామని పేర్కొన్నారు. నాణ్యత లేకపోవడంతో కాళేశ్వరం డ్యాం కుంగి పోయింది. హైదరాబాద్‌ను సాంకేతిక నగరంగా తీర్చిదిద్దాం. ప్రపంచంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చాము. కానీ వారు భూ ఆక్రమణలు, అక్రమాలతో హైదరాబాద్‌ను దోచుకున్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారు. కేసీఆర్‌ తిరుగుతున్న రోడ్లు, విూరు చదువుకున్న విద్యాసంస్థలు కాంగ్రెస్‌ కట్టినవే. మోదీ ఏమంటారో కేసీఆర్‌ అదే అంటారు. మోదీ తెచ్చే చట్టాలకు కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నాపై మోదీ ప్రభుత్వం 24 కేసులు పెట్టారు. నా ఇంటిని లాక్కున్నారు. కేసీఆర్‌ విూద ఎందుకు దాడులు చేయడం లేదు. విచారణలు ఎందుకు చేపట్టడం లేదో మోడీ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అమిత్‌ షాలు రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారు. బీజేపీ నేతల టైర్ల గాలి తీసేశాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ డ్రామాలో ఎంఐఎం చేరింది. ఎంఐఎం కేవలం మమ్మల్ని ఓడ గొట్టడానికే ఉంటుంది. మా ప్రభుత్వం రాగానే మేమిచ్చిన ఆరు గ్యారంటీలను చట్టలుగా మారుస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వంలో నెలకు 2000 బస్సు ఛార్జీలు ఖర్చు చేశారు. మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. తెలంగాణ అమరవీరులకు 250 గజాల స్థలం ఇస్తాం. యువతకు విద్యా భరోసా కార్డు ఇస్తాం. కార్డు ఉన్నవారికి పై చదువుల కోసం 5 లక్షలు ఇస్తాం.విూరు కలలుగన్న ప్రజా తెలంగాణ సాధిస్తాం.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్‌ అవినీతి, అహంకార సర్కార్‌ను గద్దెదించే అవకాశం విూ చేతుల్లో ఉందన్నారు.
కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి
సంగారెడ్డి బ్యూరో::దొరల సర్కారుకు ప్రజల సర్కారుకు మధ్య పోటీ జరుగుతుంది, ఈ ఎన్నికల్లో దొరల సర్కారుకు స్వస్తి పలికి, ప్రజల సర్కారుకు నాంది పలకాల్సిన అవసరం ఉందని భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ అన్నారు.  ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గంజి మైదాన్‌ లో  రాహుల్‌ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు.  ఈ సభకు రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలను కెసిఆర్‌ మోసం చేస్తున్నారని,  గత తొమ్మిది సంవత్సరాల్లో కెసిఆర్‌ చేసింది ఏవిూ లేదని ఎద్దేవా చేశారు . తెలంగాణ రాష్ట్రంలో దొరల ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలందరూ ఈ ఎన్నికల్లో ప్రజల సర్కారులు తీసుకురావాలన్నారు. అందుకే చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలో అవినీతిమయం పెరిగిపోయింది అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టులో రూపాయలు లక్ష కోట్ల అవినీతి జరిగిందని,  కాంగ్రెస్‌ సర్కారు వస్తే అవినీతిని విచారణ చేయించి డబ్బులు కక్కిస్తామన్నారు.పదేళ్ల పాలన లో నువ్వు ఏం చేశావో చెప్పగలవా కెసిఆర్‌ అని  రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.ఈ పదేళ్లలో పాలనలో  బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో కెసిఆర్‌ చెప్తారా? అని కాంగ్రెస్‌  విజయ భేరి సభలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిం దన్నారు. కెసిఆర్‌ దోపిడీ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగి పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందన్నారు. కుటుంబ పాలన పెరిగిందని, ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ఇలాంటి అవినీతి చేసినవారికి  సరి అయిన గుణపాఠం చెబుతారన్నారు .తెలంగాణ ఆదాయ మంతటినీ కెసిఆర్‌ కుటుంబం దోచు కుంటోం దన్న రాహుల్‌.. ల్యాండ్‌, సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కెసిఆర్‌ కుటుంబం చేతిలోనే ఉందని భావోద్వేగంతో  ఆయన ప్రసంగించారు.ధరణి పోర్టల్‌ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని,  తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌  అభివృద్ధి చేసేది కాంగ్రెస్‌ అని రాహుల్‌ గాంధీ అన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెరిగింది అన్నారు.పేపర్ల లీక్‌ వల్ల ఎంతో నష్టపో యామని యువకులు బాధను వ్యక్తం చేశారని చెప్పారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే అవి రద్దు అయ్యాయని బాధపడ్డారన్నారు. ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మనకు అవసరమా?అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లోకి రాగానే  కెసిఆర్‌ దోచుకున్న సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్నారు. సంగారెడ్డి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . ప్రజల మనిషి, కృషివలుడు అయిన జగ్గారెడ్డికి  ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  సంగారెడ్డి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు . జగ్గారెడ్డిని తాను బాగా ఎరుగుదునని,  పాదయాత్రలో  ఆయన చూపిన చొరవ  నేను గుర్తుపట్టానన్నారు. ప్రజల్లో ప్రజా కష్టాల్లో  పాలుకువంచుకునే వ్యక్తి జగ్గారెడ్డి అని కొనియాడారు. సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కూతురు జయరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు తోపాది అనంత కిషన్‌, రాజారెడ్డి, రఘురాం రెడ్డి ,  బుచ్చి రాములు, బక్క బలరాం, ప్రవీణ్‌ కుమార్‌, సందీప్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కాంగ్రెస్‌ యువ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

తాజావార్తలు