పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఈవో విశ్వనాథరావు తెలిపారు.  ఈనెల 25 నుంచి వచ్చే 11 వరకు పరీక్షలు జరుగుతాయని ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను సవిూక్షించారు.  జిల్లాలో పరీక్షలకు 231 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. 48,442 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులను, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.  ఎంపీడీవో, తహసీల్దార్‌, ఆర్‌డీవోలు ఎప్పటికప్పుడు పరీక్షలను పర్యవేక్షించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలన్నారు.

తాజావార్తలు