‘పద్మభూషణ్’ కోసం రచ్చకెక్కిన మరో ఆటగాడు!

న్యూఢిల్లీ:’ పద్మ’ అవార్డుల అంశం కేంద్రానికి మరింత తలనొప్పిగా మారింది. భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఉదంతానికి ముగింపు పలికి  కొన్ని గంటలు అయ్యిందో లేదో తన పేరును కూడా పద్మ భూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయాలంటూ బాక్సర్ విజేందర్  రచ్చకెక్కాడు.

తనకు పద్మభూషణ్ ఇవ్వాలంటూ ఈ అథ్లెటిక్ పట్టుబడుతున్నాడు.  ఈ మేరకు కేంద్ క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ పంపాడు. విజేందర్ సింగ్ 2008 జరిగిన ఒలింపిక్స్ లో కాంస్యం సాధించాడు.  అంతకుముందు సైనా నెహ్వాల్ తన పేరును ఖరారు చేయకపోవడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత కేంద్ర క్రీడల శాఖ స్వయంగా కల్పించుకుని ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించింది.