పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణే అత్యుత్తమ రాష్ట్రం

3
– యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సభ్యులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి)::

అమెరికా పరిశ్రమ వర్గాల పెట్టుబడులకి తెలంగాణ అత్యుత్తమ , అకర్షనీయమైన గమ్యమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణాభివృద్ది కోసం విసృతమైన ప్రణాళికలను తమ ప్రభుత్వం చేపడుతున్నదని, అకర్షనీయమైన పారిశ్రామిక విధానం, ప్రభుత్వం తోడ్పాటు, వంటి సానూకూలంశాలు పెట్టుబడులకి అలంబనగా ఉంటాయని మంత్రి తెలిపారు. యూయస్‌  ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ పంచాయితీరాజ్‌ , ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావుని సచివాయలంలోని అయన చాబంర్లో కలిసారు. ఇప్పటికే ఐటి, ఫార్మరంగంలో తెలంగాణ ముందువసరలో ఉందని వారికి మంత్రి తెలిపారు. అయా రంగాలతో పాటు ఏరోస్పేస్‌, ఏలాక్ట్రానిక్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులకి హైదరాబాద్లో అవకాశాలున్నాయని మంత్రి యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులకి తెలియజేశారు. తన అద్యర్యంలోని ఐటిశాఖతో పాటు వివిధ రంగాల్లోని అవకాశాలను మంత్రి వారికి వివరించారు. హైదరాబాద్‌ ని ప్రపంచస్ధాయి నగరంగా మార్చేందుకు, ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తుందని, నగరంలో ఉన్న మౌళిక వసతులు, సురక్షితమైన శాంతి బద్రతలు వల్లనే శాంతి బద్రతల వల్లే పలు సర్వేల్లో ప్రథమ స్ధానం దక్కించుకున్నదని, ఇలాంటి కాస్మోపాలిటన్‌ నగరంలో యూయస్‌(ఙూ) ?ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ పెట్టుబడులు పెడితే బాగుంటని మంత్రి వారిని కోరారు.

తన శాఖ అద్యర్యంలో చేపట్టిన…టిహబ్‌, టాస్క్‌….వంటి కార్యక్రమాలను ప్రస్తావించిన మంత్రి తారక రామారావు…తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విథానం….వల్ల పరిశ్రమలకి కావాల్సిన అనుమతులను కేవలం 15 రోజుల్లోనే పొందవచ్చని….పెట్టుబడి దారులకి దేశంలోనే మెదటి సారి రైట్‌ టూ సింగిల్‌ విండో క్లీయరెన్సెస్‌ ని కల్పించామని మంత్రి యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ కి తెలియజేశారు. పార్మరంగంలో పెట్టుబడులను మరింతగా అకర్షించేందుకు ప్రత్యేకంగా ఫార్మసీటి ఏర్పాటు చేస్తునన్నామన్నారు. ఇప్పటికే మెడికల్‌ టూరిజంకి హైదరాబాద్‌ గమ్యంగా మారిందని…ఈ రంగంలో మరింత ముందుకు పోయేందుకు పలు తీసుకుంటామన్నారు.  యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ బృదంలో భాగంగా వచ్చిన పలు అంతర్జాతీయా కంపెనీలు ప్రముఖులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టెందుకు అసక్తి చూపిస్తున్నామని తెలిపారు.

తాను వచ్చేనెలలో అమెరికాలో పర్యటించి అక్కడి పారిశ్రామిక వర్గాలతో ముఖాముఖి చర్చలు చెపట్టనున్నామని… గూగుల్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలను కలుస్తామన్నారు. యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ హెల్త్‌, విద్యా వంటి రంగాల్లో పలు ప్రతిపాధనలతో ముందకు రావాలని కోరారు. నూతన రాష్ట్రంగా తెలంగాణ సరికోత్త అభివృద్ది శిఖరాలను చెరేందుకు ప్రయత్నిస్తామని,  ఇందులో యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ కలిసిరావాలని కోరారు. యూయస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌  కార్యనిర్వహక ఉపాధ్యక్షురాలు డయాన్‌ ఫారెల్‌ నాయకత్వంలో   యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సభ్యుల  బృందంమంత్రి కెతారక రామారావు ను కలిశారు.