పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత*: ఆశిష్ సంగ్వాన్

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గౌరవ  జిల్లా అదనపు కలెక్టరు ( స్థానిక సంస్థలు)  ఆశిష్ సంగ్వాన్ పెబ్బేరు మండలం  సుగూరు గ్రామాన్ని సందర్శించి ర్యాలీ లో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త ను వేరు చేసి చెత్త ట్రాక్టర్ కు ఇవ్వాలి. ఎవ్వరు కూడా అరు బయట మల విసర్జన చేయరాదు. అలాగే మీ ఇంటి పరిసరాలలో తప్పక మొక్కలు పెంచాలన్నారు. ప్రజలు, విద్యార్థులకు, గ్రామ సర్పంచ్, పంచాయితీ సెక్రటరీ, గ్రామానికి వచ్చే రహదారిలో ఉన్న పెంట కుప్పలు తొలగించాలని అలాగే రోడ్ల కు ఇరు వైపుల మొక్కలు పెంచి సరియైన పద్ధతిలో నిర్వహించాలని, పిచ్చి మొక్కలు తొలగించి, రోడ్ల పై చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు.  కార్యక్రమంలో  ఎంపీపీ అవుల శైలజా కురుమూర్తి, జెడ్పీటీసీ  పెద్దింటి పద్మా వెంకటేష్, సర్పంచ్ వెంకటస్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింహులు, ఎంపిడిఓ వి. ప్రవీణ్ కుమార్, ఏపీడీ సుల్తాన్, ఏ పి ఒ అక్తరున్నిస బేగం, టీ ఏ యాదగిరి పంచాయితీ సెక్రటరీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.