పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలి:చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న
కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.హుస్నాబాద్ ఆగస్టు 21(జనంసాక్షి) సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలనీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం రోజు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమములో భాగంగా చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న 17వ, వార్డులో బ్లీచింగ్ పౌడర్,మాలతీన్, దోమల నివారణ మందు, ఆయిల్ బాల్స్ స్ప్రే చేయించారు.పట్టణ ప్రజలందరూ తమ ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటిని శుభ్రపరచాలని తెలిపారు.పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని తీసివేయాలని సూచించారు.ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు.ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి వీలవుతుందని అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు వారానికి పది నిమిషాలపాటు ఆదివారం రోజు కేటాయించి పరిసరాల పరిశుభ్రత పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు వల్లపు రాజు, బొజ్జ హరీష్, ,మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న , కోఆప్షన్ సభ్యులు ఐలేని శంకర్ రెడ్డి,యండి అయూబ్ , పున్న సది, బండి పుష్ప, గడిపే కొమురయ్య, రాజ మల్లయ్య కమిషనర్, నాగరాజు ఎస్ ఐ, రవికుమార్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, మెప్మా రాజు ,ఆర్పి లు,సి ఎ,లు వార్డు ప్రజలు, నాయకులు,మున్సిపల్ కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.