*పరిసరాల పరిశుభ్రత పొడిచెత్త, తడిచెత్త లపై విద్యార్థులకు అవగాహన*

పెబ్బేరు అక్టోబరు 20 (జనంసాక్షి):
  పెబ్బేరు మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పరిసరాల స్వచ్ఛత మరియు పొడిచెత్త,తడిచెత్త లపై మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయినాథ్  అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పాఠశాలతో పాటు పరిసరాల పరిశుభ్రత లో విద్యార్థులు శ్రద్ద చూపాలని విద్యార్థులకు వివరించారు. తడిచెత్త, పొడిచెత్త ను గురించి అవగాహన కల్పించారు. పాఠశాల లోని మినరల్ వాటర్ ప్లాంట్,  విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహన భోజనం నాణ్యత పాటించాలని తెలిపారు.
 కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు పార్వతి మహేందర్ గౌడ్, మేకల సుమతి ఎల్లయ్య యాదవ్, పద్మ వేణు యాదవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమ మహేశ్వర్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.