పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
: వైస్ ఛాన్స్ లర్ బాల కిష్టారెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :
స్వచ్ఛత అనేది మానవ వ్యక్తిగత జీవన శైలికి ఎంతో ముఖ్యమైనదని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడి శ్రీకారం చేట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా శామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల సామాజిక స్వచ్ఛత అనేది మానవ వ్యక్తిగత జీవన శైలికి స్వచ్చత ఎంతో ముఖ్యమన్నారు. సుచి శుభ్రత అనేది మానవ మనుగడకు కీలకమని ప్రతి ఒక్కరు కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. నల్సార్లో పరిసర పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత,
బాధ్యతలో భాగంగా స్వచ్ఛ నల్సార్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బాధ్యతయుతంగా ప్రవర్తిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా నల్సార్లో విస్తృత పరిచి స్వచ్ఛ నల్సార్
కోసం వినుత్నంగా జరిపిస్తున్న కార్యక్రమంతో విద్యార్థులో మరింత ఉత్సహాన్ని, బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్సార్
అధ్యాపకులు డాక్టర్ బి. మల్లికార్జున్, శివచరణ్, విద్యార్థులు, అధ్యాపకబృందం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
30ఎస్పీటీ -2: పరిసరాలను పరిశుభ్రం చెయ్యడానికి వెళ్తున్న దృశ్యం