పరిస్థితులకు అనుకూలంగా మారితేనే భవిష్యత్‌

తెరాసతో సారూప్యం మాత్రమే ఉంది : బర్ధన్‌
హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) :
మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారితేనే భవిష్యత్‌ ఉంటుందని సీపీఐ సీనియర్‌ నేత ఏబీ బర్ధన్‌ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన ‘సీపీఐ కార్యాచరణ ముసాయిదాపై చర్చ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో తెరాసతో తమకు సారూప్యత మాత్రమే ఉందని, దీనికి సీపీఎం వక్రభాష్యం చెప్పడం తగదని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడి ఉండవచ్చేమోకాని ఆ పార్టీ విధానాలు మాత్రం అవలంబించలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలు పేదలను విస్మరించాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల దృక్పథం, మారుతున్న పరిస్థితుల మేరకే తమ పార్టీ విధానాలను మార్చుకొని వారి కోసం ఉద్యమిస్తున్నామని తెలిపారు. ప్రజాపక్షం వహించని పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ తదితరులు పా