పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని వేగవంతంగా చేపట్టాలి….

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ అక్టోబర్ 21(జనం సాక్షి):పాలకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికై చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలకుర్తి దేవాలయంలో కళ్యాణ మండపం, స్టేజి పనులను విస్తరింప చేయాలన్నారు. అదేవిధంగా స్మృతి వనం పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. అందుకు సంబంధించి కేటాయించిన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలును రెవెన్యూ అధికారులు త్వరితగతిన అప్పగించాలన్నారు.దేవాలయ ప్రాంగణంలో స్నానాల గదులతో పాటు మరుగుదొడ్లు నిర్మించాలని అదేవిధంగా మెట్లు ఎక్కే భక్తులకు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా మరుగుదొడ్ల ను నిర్మించాలన్నారు. వల్మిడి పర్యాటక ప్రాంత అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. అందుకు సంబంధించిన విద్యుద్దీకరణ పనులను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ని కలెక్టర్ ఆదేశించారు. దేవాలయం చుట్టూ డ్రైనేజీ నిర్మించాలని, వర్షపు నీరు నిలువ ఉండకుండా చెరువు కు తరలించేలా పనులు చేపట్టాలన్నారు. మరుగు దొడ్లకు తప్పనిసరిగా సోకు పిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం పరిసరాలలో సెంట్రల్ లైటింగ్ చేపట్టాలని, చెత్తాచెదారం తొలగిస్తూ అందమైన పూల మొక్కలను నాటింప చేయాలన్నారు. దేవాలయం గుట్ట క్రింది భాగంలో స్నానాల గదులతో పాటు కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మింప చేయాలన్నారు. చెరువు దేవాలయ ముకు మధ్య కళ్యాణకట్ట ఏర్పాటు చేస్తున్నందున ఆయా పరిసరాలలో భక్తుల సౌకర్యాల కొరకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టనున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డి ఆర్ డి ఏ పీడీ రామ్ రెడ్డి, ఆర్డిఓ మధుమోహన్, పర్యాటకశాఖ అధికారి గోపాలరావు,ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ మల్లికార్జున్, పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ చంద్రశేఖర్, రోడ్లు భవనాల శాఖ ఈ ఈ హుస్సేన్ తదితర అధికారులు పాల్గొన్నారు .