పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీదర్‌బాబు
కరీంనగర్‌, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి అతిధిగా హజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగాలని, ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్‌ టీచర్లున్నారని, గుణాత్మక విద్యాబోధనతో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థులలో ఆత్మస్టైర్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి అన్ని రంగాలతో రాణించేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయుల సూచించారు. కేంద్ర ప్రభుత్వం అటవి ప్రాంతాలలో గిరిజనులకు అటవి సంపదను ఉపయోగించుకొని జీవనోపాధి పొందుటకు కృషి చేస్తుందని అన్నారు. గిరిజనులకు ఏర్పాటు చేసి అటవీ ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి సాధనకు పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ విప్‌ ఆరెపల్లి మోహన్‌ మాట్లాడుతూ కాలుష్య నివారణకు మొక్కలు నాటాలని, జిల్లాలో ఉపాది హామీ పథకం ద్వారా రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలన్నారు. జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ మాట్లాడుతూ మొక్కలు నాటుట సామాజిక బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అధ్యక్షులు కె.రవీందర్‌రావు, జిల్లా విద్యాధికారి లింగయ్య, డ్వామా పి.జి.జి.మనోహర్‌, డివిజనల్‌ పార్టిస్టు అధికారులు డి. నర్సయ్య, పాఠశాల ప్రధానోపాద్యాయులు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు