పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అదిలాబాద్‌/ దండేపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి ప్రతాపరెడ్డి అన్నారు. వనమహోత్సవం సందర్భంగా దండేపల్లి ఉన్నత పాఠశాల, నెల్కివెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపక్షేత్రాధికారి కల్పనాదేవి, ప్రాధానోపాధాఓ్యయులు కె.హన్మంతరావు, అన్నం సత్యనారాయణ, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మదార్‌గౌడ్‌, ఎఫ్‌బీఓలు వేణుగోపాల్‌రెడ్డి, హన్మంతరావు, కృష్ణ, గోపాల్‌సింగ్‌, ఎన్సీసీ అధికారిణి పి.వరలక్ష్మీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ద్వారక ఉన్నత పాఠశాలలో, చింతపల్లి ప్రాథమికోన్నత కస్తూర్బా విద్యాలయం , కుంటల్‌గూడ జీవీవీకే పాఠశాలలో మొక్కలు నాటారు. పాఠశాలల హెచ్‌ఎంలు కృష్ణమూర్తి అన్నం సత్యనారాయణ పురుషోత్తం, రఘునాథం విద్యార్థులు పాల్గొన్నారు.