పర్వతగిరి ఎస్సై రియల్ హీరో అంటున్న కల్లెడ గ్రామస్తులు

వరంగల్ బ్యూరో, జూలై 27 (జనం సాక్షి):గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పర్వతగిరి మండలంలోని కల్లెడ ప్రాంతంలో  నిన్నటి రోజున రాష్ట్రంలో ఎక్కడ  లేని విధంగా అత్యధికంగా 285 సెంటీ మీటర్లు వర్షపాతం కురవడంతో కల్లెడ రిజర్వాయర్ లోకి  చుట్టుపక్క ప్రాంతాలోని వరద నీరు భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో  రిజర్వాయర్ కి గండి పడే ప్రమాదం గుర్తించిన పర్వతగిరి ఎస్సై వీరభద్రం  గత రాత్రి నుండి ఉదయం 5గంటల వరకు  తన సిబ్బంది మరియు స్థానికులతో కల్సి తక్షణ చర్యలకు సిద్ధపడి రిజర్వాయర్ నుండి నీరు బయటికి వెళ్లే మార్గాన్ని సుగమం చేయడంతో కల్లెడ గ్రామాన్ని ముంపుకు కాకుండా కాపాడంలో  కృషి చేయడంతో  పర్వతగిరి  ఎస్. ఐ  రియల్ హీరో అంటూ కల్లెడ గ్రామస్తులు జేజేలు పలకడమే కాకుండా…. పర్వతగిరి  ఎస్. ఐ ని అభినందిస్తూ వరంగల్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ కు ప్రజలు సంక్షిప్త మెసేజ్ పంపిస్తున్నారు…ఈ సందర్భంగా పర్వతగిరి ఎస్. ఐని వరంగల్ కమిషనర్ అభినందించారు.