-->

పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ముక్తార్ నాజ్ మాతృమూర్తి మూడు రోజుల క్రితం అనారోగ్యంగా మృతి చెందడం పట్ల విషయాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలుసుకొని
కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారి రమేష్ మాతృమూర్తి అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్, మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ కలసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ వారి వెంట కౌన్సెలర్ మణపురం రాము, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖావి, జిల్లా ప్రణాళికా సంఘం మెంబర్ పట్లోళ్ల నరసింహులు, పట్లోళ్ల బాల్ రెడ్డి, అబ్దుల్ బాయ్,అబ్దుల్ మననాన్ ,అబ్దుల్ లతీఫ్, బాషిర్,ఖలీల్,తదితరులు ఉన్నారు.