పల్లాను గెలిపించేందుకు కృషి చేయాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి కోరారు. 14వ ఆర్థిక సంఘం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మిగులు బ్జడెట్‌ ఉందని తేల్చి చెప్పిందని, ఈ విషయం కేసీఆర్‌ 14 ఏళ్ల క్రితమే చెప్పారన్నారు. ఇంత కాలంగా ఆంధప్రాంత నేతలు తెలంగాణ నిధులు వారి ప్రాంతాలకు మళ్లించుకుని అభివృద్ధి చేసుకున్నారన్నారు. ఇప్పుడు మనకు ఏం అన్యాయం జరిగిందో తెలుస్తుదని అన్నారు.ఇంతకాలం ఆంధ్రా నేతలు  తెలంగాణను వెనుకబడేలా చేశారన్నారు. మన నిధులు, ఉద్యోగాలు, నీళ్లు దక్కాలంటే మేధావులంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణను చీకట్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లు ప్రకారం54 శాతం విద్యుత్తు వాటా తెలంగాణకు ఇవ్వాల్సిఉండగా అడ్డుపడుతున్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  నాగార్జునసాగర్‌ జలాల విషయంలోనే మనం

ఎంతగా నష్టపోయామో ఇటీవల తెలిసిందన్నారు. మనం నీరు ఇచ్చినా వాటా ప్రకారం మనకు రావాల్సిన విద్యుత్‌ను మాత్రం చంద్రబాబు ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టులో నీటినీ  ఎడమ కాల్వ పరిధిలోని రైతులకు అందించి  ఆదుకుంటామని మంత్రి హరీష్‌రావు భరోసా ఇచ్చారన్నారు.  కేంద్ర బ్జడెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపిన భాజాపాకు ఈ ఎన్నికల్లో ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పోరాడి తెలంగాణ సాధిస్తే భాజపా 7 మండలాలను ఆంధ్రలో కలిపిన విషయాన్ని అంతా గుర్తించాలన్నారు. పల్లాను గెలిపించి జిల్లా పట్టభద్రులు  తమసత్తా చాటాలన్నారు. తెలంగాణ అభివృద్ది నినాదంగా సాగుతున్న కెసిఆర్‌కు అండగా నిలవాలన్నారు.

తాజావార్తలు