పల్లెప్రగతిలో పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్

నిర్మల్ బ్యూరో, జూన్13,జనంసాక్షి,,,   పల్లె ప్రగతి లో భాగంగా  11వ రోజున  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్  ఫారుఖీ,   అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో  కలసి     దిలావర్ పూర్  మండలం  సాంగ్వి,  బాన్సపల్లి,  సిర్గాపూర్  లలో   పల్లె ప్రగతి కార్యక్రమం లో  చేపడుతున్న   పనులను   పరిశీలించారు.
ఈ సందర్బంగా  సాంగ్వి  ప్రాధమికొన్నత  పాఠశాల మన ఊరు మన బడి   లో  మోడల్ స్కూల్ గా ఎంపికైనందున  స్కూల్  మారమ్మత్తు పనులను   పరిశీలించి త్వరగా  పూర్తి చేయాలని,   అంగన్వాడీ స్కూల్  ఆవరణలో  పిల్లల  కొరకు   ఏర్పాటు చేసిన   బెంచీలు,పెయింటింగ్,   స్లో గన్స్  చాలా  బాగున్నాయని   హర్షం   వ్యక్తం  చేశారు.
వంట  కట్టెల పొయ్యి మీద చేస్తుండడం  చూసి   గ్యాస్  పైనే  చేయాలని   ఆదేశించారు.
అనంతరం  డంపింగ్ యార్డ్, డ్రైనేజీ,  తెలంగాణ క్రీడా ప్రాంగాణాలు  స్థలం  పరిశీలించి   వారం లోపు  పూర్తి  చేయాలని  అన్నారు.
బాన్సపల్లి లో  మోడల్ స్కూల్,  పల్లె ప్రకృతి వనం,  వైకుంఠ దామాలు   పరిశీలించి,  సిర్గాపూర్  జాతీయ రహదారి  ఇరువైపుల   ఎవెన్యూ ప్లాంటేషన్  ఏర్పాట్లను  పరిశీలించారు.
 ఇందులో  mro కరీం, ఎంపీడీఓ మోహన్,     సర్పంచ్  అచ్యుత్ రావ్,  పద్మ,  ఎంపీఓ, తదితరులు పాల్గొన్నారు.