పల్లె దావఖాన వైద్యుల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
గరిడేపల్లి, జూన్ 18 (జనం సాక్షి):ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గరిడేపల్లి ని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి శనివారం పరిశీలించారు. అనంతరం వారు రాయిని గూడెం తాళ్ళ మల్కాపురం అబ్బిరెడ్ది గూడెం గ్రామాలలో పల్లె దవాఖాన లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రత్యేక వైద్యులను నియమించడం జరిగిందని వారి ఆధ్వర్యంలో గ్రామంలో అసంక్రమిత వ్యాధుల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు షుగర్ పరీక్షలు నోరు రొమ్ము గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని పల్లె దావకాన వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో గ్రామాలలో వైద్యులు అందుబాటులో లేరని ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా పల్లె దావకాన ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అరీఫ్ , అభి రెడ్డిగూడెం వైద్యాధికారి డాక్టర్ సంతోష్, సూపర్వైజర్ అంజయ్య, స్టాఫ్ నర్స్ హైమావతి , ఆరోగ్య కార్యకర్త సరస్వతి , ఆశ కార్యకర్త జయమ్మ తదితరులు ఉన్నారు.