పల్లె, పట్టణ ప్రగతి జిల్లాలో అందరి సహకారం తో విజయవంతం..మంత్రి అల్లోల
పట్టణంలో పాదయాత్ర చేసిన మంత్రి, జిల్లా పాలనాధికారి,
నిర్మల్ బ్యురో, జూన్18,జనంసాక్షి,,, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పల్లె ,పట్టణ ప్రగతి ప్రజల్లో మార్పు తెచ్చిందని రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంతో పాటు నిర్మల్ రూరల్ మండలం లోని న్యూ పోచంపాడ్ గ్రామంలో నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 3 నుండి 18 వరకు 15 రోజుల పాటు నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి ద్వారా ప్రజలకు అనేక సౌకర్యాలు కలిపించడం జరిగిందన్నారు.
దేశంలో పది గ్రామ పంచాయతీ లు తెలంగాణ నుండే ఎంపిక అయ్యాయని గుర్తు చేశారు. 15 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. నిర్మల్ లో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మంత్రి తో పాటు అధికారులు నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు కొనసాగింది. పట్టణంలో త్రాగు నీరు కోసం 5 వాటర్ ట్యాంక్ లు రూపాయికే నల్లా కనెక్షన్ తో ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పట్టణ ప్రగతిలో భాగస్వాములు అయిన ప్రతీ ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే స్పూర్తితో ముందుకు వెళ్ళలన్నారు. నిర్మల్ రురల్ మండలం లోని న్యూ పోచంపాడ్ లో నూతన క్రీడా మైదానన్నీ ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించిన అనంతరం బ్రహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంబించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ రాం సాగర్ ముంపుకి గురైనా పునరావాస గ్రామల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కలిపించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తుందన్నారు. మన ఊరు మన బడి కింద జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ఇంగ్లీష్ మద్యమాన్ని అమలు చేస్తామన్నారు జిల్లాలో 50 వేల ఎకరాలు సాగు నీరు అందించేందుకు 27 ప్యాకేజి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నయాని మంత్రి వివరించారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నామని, యువతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా 15 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
పిల్లలు ఆటలకు దూరం అవుతున్న సందర్భంలో ఆటలతో పాటు మంచి ఆరోగ్యం కొసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినందున యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నిర్మల్ జిల్లా NRIGS లో మొదటి స్థానం లో ఉందని, మన జిల్లా అన్నింటిలోనూ ముందు వరస లో ఉందని, ఇలాగే కొనసాగించాలని అన్నారు.
ఇది నిరంతర ప్రక్రియ అని కౌన్సిలర్ లు బాధ్యత తో పనిచేసి తమ తమ వార్డులను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహనా కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో dsp జీవన్ రెడ్డి, rdo తుకారామ్ drda విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|