పల్లె పరివర్తన సొసైటీ ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు.

 పట్టణంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను పల్లె పరివర్తన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెపరివర్తన సొసైటీ సభ్యులు నేనావత్ రాకేష్ నాయక్ మాట్లాడుతూ… నాడు భారత దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయుల పరిపాలన వ్యతిరేకించి దేశ ప్రజల కోసం భవిష్యత్తు తరాల కోసం కణనరంగంలో ఆంగ్లేయులతో చివరి వరకు పోరాడి కాల్పి అనే ప్రదేశంలో వీరమరణం పొందిన మహాయోధురాలు వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని గుర్తుచేశారు.. తన పోరాట పటిమతో బ్రిటిష్ పాలకుల మెడలు వంచిన గొప్ప మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా యావత్ భారత దేశ సమాజానికి స్ఫూర్తి రగిలించిన యోధురాలు ఆమె చేసిన పోరాటాన్ని , ఆమె ప్రాణ త్యాగం భారతావని ఎల్లవేళలా స్మరించుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా  ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ లెక్చరర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.