పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి అని ఆయా జీపీ సర్పంచ్లు అన్నారు. శనివారం రోజున 5వ విడత పల్లె ప్రగతిపై ముగింపు సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.ఈ కార్యక్రమం తో పల్లె పట్టణాలు అభివృద్ధి బాట పడుతున్నాయని బొందిడి సర్పంచ్ ఆడే అనిత జనార్ధన్ గుమ్ముల గంగాదేవి జాధవ్ కల్యాణి మహేందర్ విశాల్ జాధవ్ రమేశ్ రూపావత్ సుజాత గోపిచంద్ తోపాటు ఆయా జీపీ సర్పంచ్లు అన్నారు.మండలంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామం నర్సరీ పారిశుధ్య అభివృద్ధి పనులను అధికారులు ప్రజా ప్రతినిధులు పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర దినచర్య అన్నారు.పల్లె పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభూత్వం నిధులు సకాలంలో పంచాయతుల అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు.పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పరిశీలిస్తూ స్థానిక సర్పంచ్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు వార్డు మెంబర్లు నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.