పల్లె ప్రగతి లో శ్రమదానం            

                          దంతాలపల్లి జూన్ 7 జనం సాక్షి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, హైస్కూల్ ఆవరణలో గ్రామ సర్పంచ్ సుస్మిత ఆధ్వర్యంలో తొర్రూరు డి ఎల్ పి ఓ షర్ఫుద్దీన్, గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ వినోద్, స్థానిక ఎంపీటీసీ నెమ్మది యాకయ్యల తో పాటు  గ్రామ ప్రజలు శ్రమదానం చేసి బస్ స్టాండ్ ఆవరణ హైస్కూల్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్,కారోబార్ యాకయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.