పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో భారీగా చేరిన వరద నీరు… – గుండెగాo మీదుగా మహాగం,పార్డీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు…

బైంసా.జూలై21 జనం సాక్షి

నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వర్షపు వరదనీటితో నిండి గుండెగాo బ్రిడ్జి మీదగా ప్రవహిస్తుంది. దీంతో గుండెగాo మీదుగా వెళ్లే మహాగాo,పార్ఢీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి వర్షాకాలం గుండేగం గ్రామప్రజలు వరద నీటితో కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఈ వర్షాకాలం కూడా ఇలాగే వర్షం కొనసాగుతూ ఉంటే పల్సికర్ రంగారావ్ ప్రాజెక్టులో వరద నీరు పెరిగి, గ్రామంలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. మరోవైపు గడ్డేన్న వాగు ప్రాజెక్టులో వర్షపు నీరు నిండి నిండుకుండలా కనిపిస్తుంది.దిoతో ప్రాజెక్టుని చూసేందుకు సందర్శకులతాకిడి మొదలైంది.