పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది
మల్దకల్ అక్టోబర్ 18 (జనంసాక్షి)మండలపరిధిలోని తాటికుంట గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల వేశారు. మల్దకల్ మండల పశువైద్యధికారి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ లాంఫి వైరస్ సోకినా పశువులు శరీరం పై గుడుపలు,దద్దురులు రావటం,కాళ్లకు వాపులు రావటం,గుడుపలు పగిలి రక్తం కారటం వ్యాధి ముదిరితే పశువు చనిపోవటం జరుగుతుందని రైతులకు వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా 431 పశువులకు ఉచితంగా టీకాలు వేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు ,విఎల్ ఓ వెంకటేశ్వర్లు,జెవిఓ రాఘవేందర్,విఏ ర్రాజేంద్ర, సిబ్బంది రామాంజనేయులు, గోపాల మిత్రులు శాంతిరాజు ఆంజనేయులు ,రాజగోపాల్ రెడ్డి,దేవరాజు,మధు, తదితరులు పాల్గొన్నారు.