పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోవాలి కొండమల్లేపల్లి మండల పశు వైద్య అధికారి నాగయ్య

మండల కేంద్రంలోని శుక్రవారం నాడు గాజీనగర్ గ్రామ  పంచాయతీ పరిధిలో పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి మండల పశు వైద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ పశువులన్నింటికీ టీకాలు తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లంప స్కిన్ వ్యాధి, ఈగలు,దోమలు, గోమార్లు  ద్వారా వ్యాపిస్తుందని పశువులను శుభ్రంగా ఉంచుకోవడం సైపర్ మెట్రిన్  ద్రావణాన్ని 2 ఎమ్ ఎల్ ఒక లీటర్ నీటిలో పిచికారి చేయడం వలన వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు గాజీనగర్ సర్పంచ్ పేట రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న టీకాలను విధిగా రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని నిర్వహించి పశువులకు ఖనిజలవన మిశ్రమాన్ని మందులను ఉచితంగా అందజేశారు ఈ శిబిరంలో లంపస్కిన్ వ్యాధి టీకాలు గర్భకోశ పరీక్షలు నిర్వహించారు గ్రామ పాడి రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లిమండల  పశువైద్యాధికారి నాగయ్య, వెటర్నరీ అసిస్టెంట్  నిర్మల, గోపాలమిత్ర సూపర్ వైజర్  రవికిరణ్, గోపాలమిత్ర పి వెంకటయ్య, మైత్రి ఇ.పద్మ మరియు గ్రామ పాడి రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు