పశువుల ఆసుపత్రిలో వైద్యుల కరువు
ఖమ్మం, జనవరి 28 (): జిల్లాలోని పశువైద్య శాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ పోశెట్టి తెలిపారు. జిల్లాలో 98 వైద్యుల పోస్టులకు గాను 47 ఖాళీలు ఉన్నాయన్నారు. పారాసిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయన్నారు. బిజిఆర్‌ఎఫ్ నిధులతో జిల్లాలో 159 ట్రైవిస్ అందించాలని అన్నారు. వాటర్‌షెడ్ పథకం కింద విఆర్‌పురం, ములకలపల్లి మండలాలకు 36 ట్రైవిస్‌లు అందించినట్టు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీవరకు మసూచినివారణకు మేకలకు మొదటిసారిగా వ్యాక్సిన్లు వేయనున్నట్లు ఆయన తెలిపారు.