పసుపు బోర్డుకు మోడీ పచ్చజెండా

మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత పసుపుకు భారీ డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం, ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని.. జాతీయ పసుపు బోర్డు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆ విశ్వవిద్యాలయానికి.. ఆదివాసీల కొంగు బంగారంగా కొలిచే సమక్క సారక్క పేరును పెట్టునున్నట్టు తెలిపారు. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం 900 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు మోదీ. తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్న విషయం విదితమే.