పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్

s-99కరాచీ:ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో అల్లాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ లో మరో కలకలం రేగింది. పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో  అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. గత నెల 13 వ తేదీన యాసిర్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు  తేలడంతో అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.’ యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్  క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడమే. దీంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. దీనిపై యాసిర్ అప్పీల్ చేసుకునే వీలుంది’  అని ఐసీసీ పేర్కొంది.