పాక్‌లో భారత ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌పై దాడి

పరిస్థితి విషమంలాహోర్‌, (జనంసాక్షి) :
ఇక్కడి కోట్‌ లఖ్‌పత్‌ జైలులో ఖైదీగా ఉన్న భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పై శుక్రవారం తాటి ఖైదీలు దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. జైలు అధికారులు అతనిని వెంటనే స్థానాకంగా ఉన్న ఎంఎజిన్నా ఆసుపత్రి తరలించి పరీక్షలు నిర్వహిెస్తున్నారు. జైలులో సరబ్‌ తన దుస్తులను ఉతుక్కుంటునప్నప్పుడు ఇతర ఖైదీలు దాడి చేశారని, జైలు లోని ఒక సెల్‌ నుంచి మరోసెల్‌కు అతనిని తరలిస్తుండగా ఈ దాడి జరిగిందని రకరాల వాదనలు వినిపిస్తున్నాయి. అతని తలకు తీవ్ర గామం కావడంతో సీటీ స్కాన్‌ నిర్వహించినట్లు తెలిసింది. పాకిస్థాన్‌లో అత్యంత ముఖ్య మైన ఖైదీగా ఉన్న సరబ్‌ను రక్షించేందుకు వైద్యులు శస్త్ర చికిత్స       మిగతా 2లో సైతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అందింది. ఇదా ఆలా ఉండగా సరబ్‌ పరిస్థితిని తెలుసుకోవడం కోసం పాకిస్థాన్‌ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు అధికారులు లాహోర్‌ వెళ్లారు. కోట్‌లాక్‌పత్‌ జైలు సామర్థ్యం 4,000 కాగా, ఇక్కడ 17,000 మంది ఖైదీలున్నారు. గతం లోనూ ఈ జైలులో జరిగిన దాడులలో కొందరు ఖైదీలు మరణించారు. ఇటీ వల పాక్‌ ఉగ్రవాది కసబ్‌కు భారత్‌లో ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత జైలు అధికారులు సరబ్‌కు భద్రత పెంచారని తెలిసింది.పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో 1990లో జరిగిన ఒక బాంబు దాడిలో 14 మంది మరణించగా ఇందులో సరబ్‌ హస్తముందన్న ఆరోపణలపై ఇతనికి పాకిస్థాన్‌ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, దానిని ఇంతవరకూ అమలు చేయలేదు. క్షమాభిక్ష కోసం అతను పెట్టుకున్న దరఖాస్తులను పాక్‌ ప్రభుత్వాలు తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే, ఈ కేసులో నిందితుడిని గుర్తించడంలో తప్పు జరిగిందని సరబ్‌ కుటుంబం వాదిస్తోంది. ఆయన పొరపాటున భారత సరిహద్దు దాటాడని పేర్కొంది.